క్రీడా ప్రపంచాన్ని మలుపుతిప్పుతున్న ఆటగాళ్లు, కోచ్‌లు, పెట్టుబడిదారులతో కూడిన జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలిగా భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన నిలిచారు.
అమెరికన్ బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, కార్లొస్ అల్కరాజ్, విక్టర్ వెంబన్యామా, తెంబ బవుమా, ఫిఫా అధ్యక్షుడు జియాని వంటి ప్రముఖులు కూడా ఇందులో స్థానం పొందారు.







