సమంత రూత్ ప్రభు నటించిన 'మా ఇంటి బంగారం' (తమిళంలో 'ఎంగల్ తంగం') ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం మిడిల్ క్లాస్ కుటుంబంలోకి అడుగుపెట్టిన కొత్త కోడలు ఎదుర్కొనే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇక హారర్ కామెడీ ఇష్టపడే వారి కోసం తల్లాడ సాయికృష్ణ హీరోగా, దర్శకుడిగా వ్యవహరించిన 'చెట్టు మీద దయ్యం నాకేం భయం' సిద్ధమైంది. ఫామ్ హౌస్‌లో పరిశోధన కోసం వెళ్లిన యువకులు ఎదుర్కొనే వింత సంఘటనలే ఈ కథాంశం.
కన్నడంలో 'డోడ్మాన్సా', తమిళంలో విజయ్ ఆంటోని నటించిన 'నూరు సామి', మలయాళంలో 'బాలన్ ది బాయ్' చిత్రాలు కూడా అదే రోజు విడుదలవుతున్నాయి. ట్రాన్స్‌జెండర్ మహిళ గౌరవం కోసం సాగే పోరాటాన్ని చూపించే 'LGBT: ఒక న్యాయ పోరాటం'తో పాటు 'మను', 'త్రిమూర్తులు బదిలీ', 'చిన్న చిన్న ఆసై', 'దీవానా' వంటి చిత్రాలు కూడా జూన్ 19న థియేటర్లలో సందడి చేయనున్నాయి.








