హైదరాబాద్‌లో ఎసిబి దాడులు కొనసాగుతున్నాయి. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసం, ఆఫీసులు మరియు బంధువుల ఇళ్లు కలిపి మొత్తం 13 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. గతంలో రంగారెడ్డి జిల్లాలో ఎడిగా పనిచేసిన కొంకరి నరహరి ఇంట్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.
తనిఖీల్లో రూ. 1.10 కోట్లు నగదు, గణనీయమైన బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్స్, ఖాళీ బాండ్ పేపర్లు మరియు చెక్కులను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు బ్యాంక్ లాకర్లను గుర్తించిన అధికారులు, వాటిని కాసేపట్లో తెరవనున్నారు.







