రామ్ పోతినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని నిర్ణీత బడ్జెట్‌లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో నటీనటుల పారితోషికాలు అంచనాలకు మించి ఉండటం నిర్మాతలకు షాక్ ఇచ్చింది. విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య ఒక పవర్‌ఫుల్ పాత్ర కోసం రూ. 8 కోట్లు డిమాండ్ చేయగా, హీరోయిన్‌గా భావించిన 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి రూ. 1.5 కోట్లు అడిగినట్లు సమాచారం. ఈ మొత్తాలు బడ్జెట్‌ను దాటడంతో వేరే నటీనటుల వైపు చూడాలని రామ్ నిర్ణయించుకున్నారు.

దీంతో ఆ పాత్రల కోసం ప్రత్యామ్నాయాలను వెతుకుతున్న చిత్ర యూనిట్, శ్రీనిధి శెట్టి స్థానంలో కయాదు లోహార్ పేరును పరిశీలిస్తోంది. ఆమెతో ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా, ఒకవేళ డేట్స్ సరిపోకపోతే సంయుక్త మీనన్‌ను ఎంపిక చేసుకోవచ్చని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా తారాగణం విషయంలో స్పష్టత రానుంది.