ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. కానిస్టేబుల్ పోస్టుల విషయంలో 20వేలు ఖాళీలు ఉండగా, కేవలం 5వేలు మాత్రమే భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని స్పష్టం చేశారు.

ఆందోళనకారులు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి, నిరసన తెలిపిన వారిని స్టేషన్‌కు తరలించారు.