ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ భారీ కాంట్రాక్టును బొండాడ ఇంజనీరింగ్ దక్కించుకుంది. సుమారు రూ. 1,338 కోట్ల విలువైన ఈ ఒప్పందం ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో అమలు కానుంది. ఇందులో 250 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్టుతో పాటు 50 మెగావాట్ల/200 మెగావాట్‌హవర్ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్‌ఎస్) ఏర్పాటు ఉంటుంది.
నోటిఫికేషన్ ఆఫ్ అవార్డు (ఎన్‌వోఏ) అందిన తేదీ నుంచి 18 నెలల గడువులోగా పనులు పూర్తి చేయాల్సి ఉందని కంపెనీ తెలిపింది. ఈ వార్త నేపథ్యంలో మంగళవారం బీఎస్‌ఈలో బొండాడ ఇంజనీరింగ్ షేరు ధర 4% పెరిగి రూ. 343.50 వద్ద ముగిసింది.







