భారత క్రికెట్ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆకాశ్‌దీప్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. బీహార్ రాష్ట్రం రోహ్తాస్ జిల్లాలోని బడ్డీ గ్రామానికి చెందిన ఈ ఆటగాడు, దేహ్రీలోని మాణిక్‌పూర్ నివాసి అయిన అక్షిత రాజ్‌ను జూన్ 24న పెళ్లి చేసుకోనున్నారు. ఈ శుభవార్తతో స్థానికులు, అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
వివాహ వేడుకలు జూన్ 21న తిలక్ కార్యక్రమంతో బడ్డీ గ్రామంలో ప్రారంభమవుతాయి. తర్వాత రోజుల వారీగా జూన్ 22న మెహందీ, జూన్ 23న హల్దీ కార్యక్రమాలు జరగనున్నాయి. చివరగా జూన్ 24న వధూవరుల ఊరేగింపు వారణాసిలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌కు చేరుకోగా, అక్కడ బంధుమిత్రులు, ప్రత్యేక ఆహ్వానితుల మధ్య పెళ్లి ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ వివాహానికి బీహార్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలు, క్రీడా ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, స్థానిక క్రికెట్ తార వివాహాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మంగళవారం బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ఆకాశ్‌దీప్ స్వగ్రామాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సమ్రాట్ చౌదరి రాకతో కుటుంబ సభ్యుల్లో ఉత్సాహం పెరగగా, ఆకాశ్‌దీప్ తల్లి శాలువా కప్పి, ఆకాశ్‌దీప్ పూలగుత్తి అందించి ఆయనకు ఘన స్వాగతం పలికారు.







