దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే తులసి కోట ఆధ్యాత్మికతతో పాటు ఆయుర్వేద ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అయితే, భక్తిశ్రద్ధలతో పెంచినా కొద్దిరోజులకే ఆకులు నల్లగా మారి రాలిపోవడం లేదా మొక్క ఎండిపోవడం జరుగుతుంది. వాతావరణం మాత్రమే కాకుండా, నిత్యం పూజ సమయంలో లేదా పెంపకంలో చేసే చిన్న తప్పులే ఇందుకు ప్రధాన కారణమని ఆయుర్వేద, గార్డెనింగ్ నిపుణులు తెలిపారు.

ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే అవసరానికి మించి నీరు పోయడం వల్ల మట్టి బురదలా మారి వేర్లు కుళ్ళిపోతాయి, కాబట్టి పైమట్టి ఎండిన తర్వాతే నీరు ఇవ్వాలి. మంజరి కనిపించగానే దాన్ని కత్తిరించకపోతే మొక్క శక్తి అంతా గింజల తయారీకే వెచ్చించి ఆకులకు పోషణ అందదు. వర్షాకాలంలో ఆకుల వెనుక చేరే పురుగుల నివారణకు వేపాకుల కాషాయాన్ని స్ప్రే చేయాలి. అలాగే రోజుకు కనీసం 4 నుండి 5 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగిలే చోట ఉంచితేనే మొక్క కళకళలాడుతుంది.