న్యూఢిల్లీ: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపిఎల్ లో భారీ ట్రేడింగ్ డీల్ చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ, లక్నో జట్ల మధ్య ఆటగాళ్ల మార్పిడి జరిగింది.ఢిల్లీలోకి పంత్.. లక్నోలోకి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెళ్లనున్నారు. దీంతో పంత్ వేలంలో భారీ కోత పడనుంది. 2025 మెగా వేలంలో లక్నో.. పంత్ ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపిఎల్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు.
అయితే, ఇప్పుడు ట్రేడింగ్ డీలో లో పంత్, కేవలం రూ.15 కోట్ల ధరకు ఢిల్లీ జట్టులో చేరనున్నాడు.ఇక, లక్నో.. కుల్దీప్ యాదవ్‌ను ప్రస్తుత వేతనం రూ.13.50 కోట్లకే తమ జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.
కాగా, గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో పంత్ ప్రదర్శన నిలకడలేమిగా ఉంది. ఐపిఎల్ చరిత్రలోనే రికార్డు ధర పలికిన పంత్.. గత రెండు సీజన్లలో ఆడిన 28 ఇన్నింగ్స్‌లలో అతను కేవలం మూడుసార్లు మాత్రమే 50కి పైగా పరుగులు (ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు) సాధించాడు.








